Monday, 27 July 2026 12:59:49 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

తెలంగాణ డీఎస్సీ - 2024..దరఖాస్తు ప్రక్రియ ముగిసింది...

-- 2.84 లక్షల దరఖాస్తులు

Date : 21 June 2024 03:55 PM

Telugu Rekha Media - ఎడ్యుకేషన్ / హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన 'TG DSC - 2024' దరఖాస్తు ప్రక్రియ ముగిసింది జూన్20 సాయంత్రం నాటికి 3,02,798 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా.. ఇందులో 2.84 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు, ప్రతి ఉద్యోగం కోసం రూ.1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.మరోవైపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 'అప్లికేషన్ ఎడిట్' ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 64,556 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు సవరించుకున్నారు. టెట్ ఫలితాలు విడుదలకావడంతో.. అభ్యర్థులు తమ టెట్ మార్కుల వివరాలు నమోదుచేసుకోవడం, ఇతర వివరాలు మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మార్చి 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఏప్రిల్ 2తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. టెట్ నిర్వహణ తప్పనిసరి అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు టెట్ నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 2 నుంచి జూన్ 20 వరకు పొడిగించారు. టెట్ ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు. గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచిన సంగతి తెలిసిందే. తెలంగాణ డీఎస్సీ - 2024 ఖాళీల సంఖ్య: 11,062. ➥ సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT): 6,508 పోస్టులు ➥ స్కూల్‌ అసిస్టెంట్‌: 2,629 పోస్టులు ➥ లాంగ్వేజ్ పండిట్: 727 పోస్టులు ➥ పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయులు): 182 పోస్టులు ➥ స్పెషల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్): 220 పోస్టులు ➥ స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎస్జీటీ) 796 పోస్టులు అర్హతలు.. ➥ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్‌ పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు. బీఈడీ అర్హత ఉన్నవారు పోటీపడటానికి అవకాశంలేదు. ➥ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు (ఎస్‌ఏ) పోస్టులకు సంబంధిత బీఈడీ (మెథడాలజీ) పూర్తిచేసినవారు అర్హులు. నాలుగేళ్ల బీఈడీ పూర్తిచేసినవారు సైతం పోటీపడటానికి అవకాశముంది. ➥ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలి. దీంతోపాటు, యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసినవారు.. బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ➥ బీఎడ్‌, డీఎడ్‌ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. ➥ తెలంగాణ, ఏపీ టెట్‌, లేదా సెంట్రల్‌ టెట్‌ (సీ టెట్‌)లో క్వాలిఫై అయి ఉండాలి. ➥ గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా, ఈ నిబంధనను తాజాగా ఎత్తివేశారు. అంతా పోటీపడొచ్చు. ➥ ఎస్టీ రిజర్వేషన్‌ గతంలో 6 శాతం ఉండగా, పెంచిన 10 శాతాన్నే వర్తింపజేస్తారు. ➥ గతంలో లోకల్‌, ఓపెన్‌ కోటా రిజర్వేషన్‌ 80:20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95:5 రేషియోను అమలుచేస్తారు. ➥ అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4-10 తరగతుల చదువును పరిగణనలోకి తీసుకోగా, తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకుంటారు. ➥ జీవో-3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేస్తారు. మూడు పోస్టులుంటే ఒక పోస్టును మహిళతో భర్తీ చేస్తారు. వయోపరిమితి: 01.07.2023 నాటికి 18- 46 సంవత్సరాల మధ్య ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: