Sunday, 26 July 2026 11:49:17 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి

రిసోర్స్ మొబైల్ జేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Date : 04 November 2024 09:53 PM

Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాల పై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తో పాటు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. జాయింట్ వెంచర్స్ లో విలువైన ఆస్తులు ఉన్నాయి... ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ అంశంపై నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు అధ్యక్షతన మున్సిపల్, హౌసింగ్, లా సెక్రెటరీలతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ సమావేశమై వారంలోగా సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. కాలుష్యం సమస్య ఉన్న పరిశ్రమల నిర్వాహకులు తాము నగరం విడిచి ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వెళ్తామని సబ్ కమిటీకి విజ్ఞప్తులు చేశారు. పరిశ్రమల యజమానుల విజ్ఞప్తులు పరిశీలించి వారు ఓ ఆర్ ఆర్ బయట పరిశ్రమలు స్థాపించి ముందుకు వెళ్లేలా సహకరించండి, పరిశ్రమలను ప్రోత్సహించాలని హైదరాబాద్ నగరం లో జీరో కాలుష్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను సబ్ కమిటీ సభ్యులు ఆదేశించారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెగ్యులర్ గా జరుగుతున్న ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియ పై సబ్ కమిటీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. ముందుగా కొంత బాగాన్ని వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరేలా ముందుకు వెళ్లాలని గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ప్లాట్ల స్థితిగతులను సబ్ కమిటీ సమీక్షించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 5 ఎకరాల విస్తీర్ణంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రియల్ పార్కు నిర్మించాలని పరిశ్రమల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థిక చేయూత లభిస్తుందని అధికారులకు వివరించారు. సబ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలు మినిట్స్ రూపంలో నమోదు చేయాలని, మరో వారంలో జరిగే సమావేశానికి అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్టుతో సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సీసీఎల్ఏ చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హౌసింగ్ సెక్రటరీ బుద్ధ ప్రకాష్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి తదితరులు సమావేశానికి హాజరయ్యారు

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: