Sunday, 26 July 2026 11:47:01 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష..

Date : 16 August 2024 05:46 PM

Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ : మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌ జిల్లాలో త్వరలో నిర్వహించనున్న పోషణ ఆరోగ్య జాతర పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో యునిసెఫ్‌ ప్రతినిధులతో కలిసి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పోషణ, ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్యారోగ్య శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ, మెప్మా ఐకెపి శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రజలు తీసుకోవాల్సిన పోషకాహారం, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాజాత, నాటిక వంటి కార్యక్రమాలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, యునిసెఫ్‌ అధికారులు డాక్టర్‌ క్యాతీ తివారి, బి.వి.సుబ్బారెడ్డి, అడిషనల్‌ డిఆర్‌డిఓ సునిత, డిఎంహెచ్‌.ఓ సుజాత, మెడికల్‌ ఆఫీసర్‌ సౌమ్య, పంచాయతీ రాజ్‌ ఏఓ ఫరీదుద్దీన్‌, ఎంపీడీవో, ఎంపీఓ, సిడిపిఓలు, పోషణ్‌ అభియాన్‌ సిబ్బంది పాల్గొన్నారు. మానకొండూరులో పాఠశాల పరిశీలన: పోషణ ఆరోగ్య జాతర నిర్వహణకు గాను మానకొండూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి పరిశీలించారు. ఇదే పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్ర సొంత భవనాన్ని కూడా పరిశీలించారు. ఆరోగ్య పోషణ జాతర నిర్వహణకు ఉన్న సౌకర్యాలను గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోషణ జాతరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, మానకొండూర్ తహసిల్దార్ రాజేశ్వరి ఉన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: