Tuesday, 28 July 2026 03:34:48 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కల్తీసారా దుర్ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనం వహిస్తోంది...

-- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా లేఖ.

Date : 25 June 2024 09:09 AM

Telugu Rekha Media - జాతీయం / : న్యూ డిల్లీ (తెలుగు రేఖ న్యూస్) : తమిళనాడులో ఇటీవల పెద్ద సంఖ్యలో ప్రజల మరణాలకు దారితీసిన కల్తీసారా దుర్ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నిస్తూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. తమిళనాడు కల్తీసారా దుర్ఘటన పూర్తిగా మానవ తప్పిదం వల్ల జరిగిన విషాదమని ఖర్గేకు రాసిన లేఖలో నడ్డా పేర్కొన్నారు. డిఎంకె సారథ్యంలోని అధికార ఇండియా కూటమికి, కల్తీసారా మాఫియాకు మధ్య బలమైన సంబంధాలు లేకుండా ఉండి ఉంటే 56 మంది ప్రాణాలు కాపాడి ఉండవచ్చని నడ్డా తెలిపారు. తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన అత్యంత ఘోరమైన కల్తీసారా దుర్ఘటన అనంతరం కల్లకురిచిలోని కరుణపురం గ్రామంలో ఎగసిపడుతున్న చిత మంటలకు సంబంధించిన చిత్రాలను చూసి యావద్దేశ ఆత్మసాక్షి క్షోభించిందని నడ్డా పేర్కొన్నారు. షెడ్యూల్డు కులాల జనాభా అధికంగా ఉన్న కరుణపురం పేదరికం, వివక్ష కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇంతటి ఘోర విపత్తు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస పార్టీ మౌన ముద్ర దాల్చడం తనను దిగ్భాతికి గురిచేస్తోందని ఆయన ఖర్డేకు రాసిన లేఖలో పేర్కొన్నారు.తమిళనాడులో ఇటీవల జరిగిన కల్తీసారా దుర్ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా 159 మంది ఆగసుపత్రి పాలయ్యారు. కొన్ని అంశాల విషయంలో తాము పార్టీలకతీతంగా వ్యవహరించాలని, ఎస్‌సి, ఎస్‌టి వర్గాల భద్రత, సంక్షేమం కూడా అందులో ఒకటని ఆయన అన్నారు. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించేలా తమిళనాడులోని డిఎంకె సారథ్యంలోని ఇండియా కూటమి ప్రభుత్వంఐ ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఎస్ ముత్తుసామిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఖర్గేను నడ్డా కోరారు. మృతుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా పెంచి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :