Sunday, 26 July 2026 11:49:44 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

3 దేశాల పర్యటనకు ప్రధాని

Date : 15 November 2024 04:03 PM

Telugu Rekha Media - జాతీయం / : న్యూఢిల్లీ, నవంబర్ 15, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్‌ 16 నుంచి 21 వరకూ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. నైజీరియా, బ్రెజిల్తో పాటు గయానా దేశాల్లో పర్యటిస్తారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్‌ టినుబు ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్తున్నారు. 16 – 17 తేదీల్లో నైజీరియాలో పర్యటిస్తారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. నైజీరిలో భారతీయులు పలు రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాపారాల్లోనూ ఉన్నారు. నైజీరియా పర్యటన తర్వాత బ్రెజిల్ వెళ్తారు. నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్‌లోని రియోడిజనీరో నగరంలో జీ-20 సదస్సు జరుగుతుంది. ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొంటారు. జీ 20 సదస్సును భారత్ గత ఏడాది ఘనంగా నిర్వహించింది. అప్పుడే ఈ ఏడాది నిర్వహించే అవకాశాన్ని బ్రెజిల్ కు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇచ్చారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో లులా డా సిల్వా ఆధ్వర్యంలో నిర్వహించే G20 సమ్మిట్‌ కు ప్రపంచ దేశాలకు చెందిన కీలక నేతలు హాజరవుతున్నారు. జీ 20 సమ్మిట్ లో పలు దేశాలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ఇందు కోసం విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. జీ 20 సమావేశం తర్వాత రియో నుంచి ప్రధాని మోదీ గయానాకు వెళ్తారు. తమ దేశంలో పర్యటించాలని గయానా అధ్యక్షుడు మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ చాలా కాలంగా ఆహ్వానిస్తున్నారు. వెస్టిండీస్ దీవుల్లో ఒకటి అయిన గయానాలో భారత ప్రధానమంత్రి ఎవరూ గత యాభై ఆరు ఏళ్లలో పర్యటించలేదు. ప్రధాని మోదీ గయానా పార్లమెంట్‌లోనూ ప్రసంగిస్తారు. భారతీయ ప్రవాసుల సమావేశంలోనూ మోదీ ప్రసంగిస్తారు. రెండవ CARICOM-ఇండియా సమ్మిట్‌లో కూడా మోదీ పాల్గొంటారు. ప్రధాని మోదీ ప్రపంచంతో భారత్ సంబంధాల మెరుగుదల కోసం నిరంతరం శ్రమిస్తూంటారు. ఆయన అనేక దేశాల్లో తరచూ పర్యటిస్తూంటారు. ఆయా దేశాల్లో ప్రవాస భారతీయులతో సమావేశం అవుతూ ఉంటారు. గయానా వంటి దేశాలకూ వెళ్తున్న ఆయన.. తన పదవీ కాలంలో భారత ప్రధానిగా అత్యధిక దేశాల్లో పర్యటించిన రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: