Tuesday, 28 July 2026 02:43:46 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కమిషన్ కు విచారణ జరిపే అర్హత లేదనటం కెసిఆర్ అవివేకానికి నిదర్శనం...

-- బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శ

Date : 17 June 2024 04:15 PM

Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : విద్యుత్ విచారణ కమిషన్ ఎదుట మాజీ సిఎం కేసిఆర్ హాజరు కాకుండా, అసలు కమిషన్ కు విచారణ జరిపే అర్హత లేదంటూ విమర్శించడాన్ని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల ఏర్పాటు అంశాలపై కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ ముందు కేసీఆర్ హాజరై వివరణ ఇచ్చి ఉంటే ఆయనకే గౌరవంగా ఉండేదని, అసలు వివరణ ఇవ్వకుండా, విచారణ కమిషన్ నే విమర్శిస్తూ... లేఖ రాయడం విచారణ వ్యవస్థలను అగౌరవపరచడమే అని, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ తీరు అప్రజాస్వామికమని మహేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు. అసలు తన పాలనలో విద్యుత్ రంగంలో తప్పులే జరగకపోతే కమిషన్ ముందు హాజరై వివరాలు చెప్పడానికి కేసిఆర్ కు భయం ఎందుకని ప్రశ్నించారు. ఏకంగా విచారణ కమిషన్ నే తప్పుపడుతూ... మాజీ సిఎం కేసీఆర్ ఎదురుదాడి చేస్తుంటే...ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎందుకు స్పందించడం లేదనీ ప్రశ్నించారు. ప్రభుత్వం వేసిన కమిషన్ నే కెసిఅర్ తప్పు పడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. విద్యుత్ రంగంలో అక్రమాలపై సీబీఐ విచారణతో అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాజీ జడ్జీతో విచారణ కమిషన్ వేసిందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరి తమ చిత్త శుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.ఇక ఈ విషయంలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వాఖ్యలు సరికావన్నారు. కమిషన్, విచారణ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తప్పులు జరగనప్పుడు వాస్తవాలు కమిషన్ ముందు చెప్పడానికి భయం ఎందుకని ప్రశ్నించారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: