Tuesday, 28 July 2026 02:38:29 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

హైదరాబాద్ ను బేస్ చేసుకొని అల్లర్లు సృష్టించడానికి బిజెపి కుట్ర చేస్తుంది...

-- కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీమంత్రి పుష్పలీల.

Date : 17 June 2024 04:52 PM

Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : సెక్యులర్ దేశమైన భారత దేశం లో అన్ని మతాలకు , వర్గాలకు సమాన హక్కులున్నాయని,కాని జంతుబలి నిషేధం పేరుతో ఒక వర్గం వారు ఇంకోవర్గం వారిపై దాడులకు పాల్పడటంపట్ల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి పుష్పలీల ఆందోళన వ్యక్తం చేసారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం నిన్న మెదక్ లో జరిగిన సంఘటననేనన్నారు. సోమవారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఇట్టి దాడులకు బిజెపి పార్టీ అండగానిలిచి హైదరాబాద్ ను బేస్ చేసుకొని అల్లర్లు సృష్టించడానికి బిజెపి కుట్ర చేస్తుందని ఆరోపించారు. వీరి పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పుష్పలీల హెచ్చరించారు. విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ లో తనను కూడా అరెస్ట్ చేస్తారని కేసీఆర్ కు భయం పట్టుకుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ అక్రమాలు చేసిన నాయకులను కేసీఆర్ విదేశాల లో పెట్టి ఇక్కడికి రానియ్యకుండా అడ్డుకుంటున్నాడని పేర్కొన్నారు. కూతురు కవిత కూడా నాకు భయం అవుతుందని జైల్లో ఏడ్చిందని వాళ్ళ నాయకులే చెప్తున్నారని తెలిపారు. అటు మోడీ ని ఉద్దేశించి...దమ్ముంటే ఈవీఎం లను తీసేసి ఎన్నికలకు వెళ్ళమని రాహుల్ గాంధీ చెప్పారని, కానీ ఈవీఎం లను నమ్ముకొని గెలిచిండు మోడీకి ఆ ధైర్యం లేదన్నారు. ఉక్రెయిన్ ప్రధాని ఎలెన్ మస్క్ కూడా ఈవీఎం లతో అత్యంత ప్రమాదం అని చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా పుష్పలీల గుర్తు చేసారు. చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి ఓడిపోవడానికి ఈవీఎం కారణమని చెప్పి మరీ ప్రూవ్ కూడా చేశాడన్నారు. తెలంగాణలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్నారు. తెలంగాణ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన కొనసాగుతుందని, రాష్ట్ర అభివృద్ధి కొరకు పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: