Tuesday, 28 July 2026 04:28:56 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్లాస్టిక్ ఫ్రీ దిశగా పయనిద్దాం..!

-- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

Date : 06 August 2024 10:08 AM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / కరీంనగర్ : మహిళా స్వశక్తి సంఘాల సభ్యులందరు ప్రజలను భాగస్వాములను చేయాలితడి-పొడి చెత్తను వేరుగా చేసి చెత్తబుట్టలో వేసెలో పిల్లలు వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి ఇంటి వద్దే కంపోస్టు ఎరువును తయారు చేసుకొవాలి భోజనాన్ని వృదాగా పడేయకుండా తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్, హెర్బల్ గార్డెన్ లకు ప్రాధాన్యత ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్చదనం–పచ్చదనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని మనమందరం ప్లాస్టిక్ ను దూరంగా ఉంచి మన నగరాన్ని, గ్రామాన్ని ప్లాస్టిక్ ఫ్రీ గా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. సోమవారం మానకొండూరు మండలం అన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్చధనం – పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు 5 నుండి 9 వరకు ఈ స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, మహిళా స్వశక్తి సంఘాల సభ్యులందరు కార్యక్రమ ఉద్దేశ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వారందరు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో బాగస్వాములయ్యేలా చూడాలన్నారు. జిల్లావ్యాప్తంగా 740 మరుగుదొడ్లు లేని ఇండ్లు గుర్తించడం జరిగిందని, వాటన్నింటిని వెంటనే మార్కింగ్ చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. రోజువారీ కార్యక్రమాలను గురించి వివరిస్తూ 6న గ్రామంలో ప్రజలకు నల్లాల ద్వారా సరఫరా చేసే మంచినీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయనే విషయాన్ని మీ ముందే పరీక్షించి నళ్లా నీటిపై అనుమానాలను నివృత్తి చేయడం జరుగుతుందని మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి ఇంటికి మొక్కలను అందించడం జరుగుతుందని తెలియజేశారు. 7వ తేదీన పరిసరాలను పరిశుభ్రం చేసి, 8న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఇంటింటి ఫీవర్ సర్వేను నిర్వహించడం జరుగుతుందని, వర్షాకాలం అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పాటు గ్రామంలో కోతులు, కుక్కల బెడద ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 9న ప్రభుత్వ కార్యాలయ భవనాలు, పాఠశాలల్లో ను క్లీన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, అదే విధంగా మహిళా సంఘాల నేతృత్వంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని పేర్కోన్నారు. ఇళ్లలో తడి-పొడి చెత్తను వేరు వేరుగా ఉంచుకునేలా పిల్లలందరు వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటు ఆచరణలో చూపించాలన్నారు. చెత్తను ఎక్కడ పడితె అక్కడ పడేయకుండా చూడడంతో పాటు తడి-పొడి చెత్తగా వేరు చేసి ఇంటిలోనే కంపోస్టు ఎరువును తయారు చేసుకొనేలా చూడాలన్నారు. కూరగాయలు, ఇంటి సామాన్లు మరియు మాంసాహారం కొనుగోలు చేసినప్పుడు వాటిని ప్లాస్టిక్ కవర్ లో కాకుండా ఇంటి నుంచి వాటి కొరకు సంచులు, డబ్బాలను తీసుకు వెళ్లాలన్నారు. ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలు ఉన్నట్లయితే వాటిలో కూరగాయల పంటలు పండించుకోవాలని, తద్వారా ఎరువులు లేని స్వచ్ఛమైన ఆహారాన్ని మనం తీసుకోవడంతో పాటు మన కుటుంబానికి అందించుకోగలమన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే - డ్రై డే కార్యక్రమంలో గ్రామస్థులందరూ భాగస్వాములు కావాలని, వర్షాల కారణంగా ఎక్కడ నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పిల్లలు వారు తినే దానికన్నా ఎక్కువగా ఆహారాన్ని తీసుకొని వృదాగా పడేస్తుంటారు, అలా కాకుండా వారు ఎంత వరకు ఆహారాన్ని తీసుకోగలరు తెలుసుకొని అంత మాత్రమే తీసుకునేలా తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో హెర్బల్, కిచెన్ గార్డెన్ లను పెంచేలా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కరీంనగర్ లో స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసెలా మనందరం కృషి చేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చివరగా ముగ్గులు మరియు వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఎదురుగా గల పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఆర్డిఓ శ్రీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపిడిఓ వరలక్ష్మీ, యం పి ఓ కిరణ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ అలేఖ్య, వివిధ శాఖల అధికారులు, ఆశా మరియు అంగన్వాడి కార్యకర్తలు పాల్గోన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: