Tuesday, 28 July 2026 02:40:33 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వెంగమాంబ రచనలతో ఆధ్యాత్మిక చైతన్యం...

శ‌తావ‌ధాని ఆముదాల ముర‌ళి- ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.

Date : 14 August 2024 10:16 AM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / తిరుపతి : శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశార‌ని శ‌తావ‌ధాని ఆముదాల ముర‌ళి పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు మంగళవారం ఘ‌నంగా జరిగాయి. ఈ సంద‌ర్భంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు జరిగింది. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆముదాల ముర‌ళి ఉపన్యసిస్తూ, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా టీటీడీ వెంగమాంబ రచనలు వెలుగులోకి తీసుకొని వస్తున్నట్లు చెప్పారు. శ్రీ జూల కంటి బాలసుబ్రమణ్యం రచించిన తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రను పునర్ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచుతున్నట్లు తెలిపారు. వెంగమాంబ రచించిన ద్విపద భాగవతంలోని చతుర్దస్కంథాన్ని త్వరలోనే ప్రచురించనున్నట్లు ఆయన వివరించారు. శ్వేత ఇంచార్జ్ సంచాలకులు రాజగోపాల్ మాట్లాడుతూ.. తరిగొండ వెంగమాంబ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. నైతిక విలువలు పాటిస్తూ, ధార్మిక జీవనం గడపాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. అనంతరం కేరళ చిత్రకారిణి శ్రీమతి కృష్ణప్రియ చిత్రించిన తరిగొండ వెంగమాంబ చిత్రపటాన్ని రాజగోపాల్ ఆవిష్కరించి, చిత్రకారిణిని సన్మానించారు. ప్రముఖ పరిశోధకులు డాక్టర్ కేశవులు మాట్లాడుతూ.. తరిగొండ వెంగమాంబ జీవితాన్ని, రచనను సమగ్రంగా పరిచయం చేశారు. ఎస్వీ విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్థ అధ్యాపకులు డా.రాజశేఖర్ ఉపన్యసిస్తూ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన తొమ్మిది యక్షగానాలను గురించి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: