Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్ ల వద్ద పాములు సంచరించడం కలకలం రేపుతుంది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని న్యూ పీజీ హాస్టల్ వద్ద ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే స్థలం వద్ద నాగుపాము కనిపించింది. గత వారం రోజుల క్రితం ఇదే ఓయూ లో ఎస్ బి ఐ బ్యాంక్ ఎటిఎం వద్ద పాము సంచరించడం జరిగింది. ఓయూ లో హాస్టల్ల వద్ద బ్యాంకుల వద్ద పాములు బహిరంగంగా సంచరించడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని నెలల కిందట ఉస్మానియా యూనివర్సిటీలో పాము కాటుతో ఓయూ ఉద్యోగి మరణించడం కూడా జరిగింది. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
Reporter
Telugu Rekha Media