Tuesday, 28 July 2026 04:39:16 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సమిష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన...

- ఆపరేషన్ ముస్కాన్ సమీక్షా సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్ రాధిక గుప్త. - జూలై ముప్పై ఒకటి వరకు జిల్లాలో పారిశ్రామిక, పని ప్రదేశాల్లో స్పెషల్ డ్రైవ్

Date : 18 July 2024 08:29 PM

Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : అధికారులు, స్వచ్ఛంద సంస్థల సమిష్టికృషి సమన్వవయంతో బాల కార్మికు వ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాలని అదనపు కలెక్టర్ రాధిక గుప్త పిలుపునిచ్చారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు 1జూలై నుండి 31జూలై ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పై గురువారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమన్వయ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ అధ్యక్షతన నిర్వహించగా హాజరైన అదనపు కలెక్టర్ రాధిక గుప్త మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ఆపరేషన్ ముస్కాన్ టీమ్ నిబంధనల ప్రకారం జిల్లాలో పర్కాల , హనుమకొండ కాజీపేట పరిధి పారిశ్రామిక ప్రాంతాల్లో, షాపుల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో కార్మిక శాఖ,జిల్లా బాలల పరిరక్షణ విభాగం, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్ , మరియు చైల్డ్ హెల్ప్ లైన్ , స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే బాల కార్మిక నిర్మూలన చట్టం ప్రకారం సంబంధిత యజమానులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని, పద్దెనిమిది సంవత్సరాల లోపు బాల బాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే బాలల న్యాయ చట్టం ప్రకారం యజమానులపై కేసులు నమోదు చేయాలని అన్నారు. నిర్ణయించుకున్నకార్యాచరణ ప్రకారం స్పెషల్ డ్రైవ్ బృందాలకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే వాహనాన్ని, మరియు పోలీస్ శాఖ వారి వాహనాన్ని వినియోగించుకోవాలని సూచించారు. బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు మాట్లాడుతూ రెస్క్యూ చేయబడిన ప్రతి బాలుడు బాలికను కమిటీ ముందు ప్రవేశపెట్టి పునరావాసం కల్పించువరకు ఆయా శాఖలు సహకారం అందించాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ విజయవంతం కోసం అన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే సాధ్యమవుతుందని, రోజు వారీ నివేదికలు కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో సేకరించి నివేదికలు పోలీస్ శాఖ వారికి అందజేయాలని అన్నారు.

కార్యక్రమంలో ఎన్సిఎల్పి డైరెక్టర్ బుర్ర అశోక్ కుమార్, బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు , సభ్యులు కజాంపురం దామోదర్, సందసాని రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ పరికి సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి సాంబశివరావు, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్,చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ ఎస్ భాస్కర్, ఇన్స్పెక్టర్లు వెంకన్న, సంజీవ రావు, బాలల పరిరక్షణ విభాగం మౌనిక, సతీష్, జి సునీత, పి విజయ్ కుమార్, మాధవి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎర్ర శ్రీకాంత్, బి కరుణ,రీచ్ ఓయాసిస్ బాలసదనం ప్రతినిధులు ఎన్ జాన్సన్ ప్రసాద్, రవికృష్ణ, శ్రీలత, జీసీడివో ఎస్ సునీత, ఎస్ఐలు సతీష్ ,ఫసియుద్దీన్. కార్మిక శాఖ అధికారులు, ఫ్యాక్టరీ శాఖ అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :