Tuesday, 28 July 2026 05:53:06 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోన్ల రికవరీలో రాష్ట్రంలో మొదటి స్థానం...

గత కొన్ని రోజుల నుండి పడిపోయిన, దొంగలించబడిన 78 ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగింత. -- ఎస్పీ అఖిల్ మహాజన్.

Date : 29 July 2024 08:29 PM

Telugu Rekha Media - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : 20-ఏప్రిల్-2023 నుండి జిల్లాలో 1200 సెల్ ఫోన్లు సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించి 1019 ఫోన్లు సంబంధిత బాధితులకు అప్పగించడం జరిగింది.సెల్ ఫోన్ పోయిందా...సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేయండి..జిల్లా పోలీస్ కార్యాలయంలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన, దొంగలించబడిన 78 ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.సెల్ఫోన్ పోయిందా.. అయితే టెన్షన్ పడవద్దని. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లాలో వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1200 ఫోన్లు గుర్తించి 1019 సుమారుగా వీటి విలువ కోటి రూపాయలు. ఫోన్లు సబంధిత బాధితులకు అందించి 84% తో రాష్టం లో మొదటి స్థానంలో జిల్లా నిలిచిందన్నారు.రాష్ట్రములో కమిషనరేట్స్ కాకుండా మిగితా మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాలో 1000 పైగా ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. పోన్ దొరికిన బాధితులు మీ బంధువులలో, మీ గ్రామాలలో మీ స్నేహితులలో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగిన ఎక్కడైనా పడిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి అనే విషయం పై వారందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సీఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవాలి.కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సెల్ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ముందుగా ఫిర్యాదు చేయాలి, లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి www.ceir.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాప్ట్. స్టోలెన్ అనే లింకై క్లిక్ చేసి, సెల్ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ఏరోజు, ఎక్కడ పోయింది. రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇదంతా పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చన్నారు. సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 84% రికవరీ చేసి బాధితులకు అప్పగించడం లో కృషి చేసిన ఐ.టి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్ ,కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ లను జిల్లా ఎస్పీ గారు అభినందించి రివార్డు లను అందజేశారు. పోయిన ఫోను మళ్లీ దొరకదు అనుకున్న ఫోను, పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీ. పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :