Tuesday, 28 July 2026 04:31:00 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పలు అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన..

Date : 10 July 2024 01:06 PM

Telugu Rekha Media - తెలంగాణ / మహబూబ్ నగర్ : డిసెంబర్ 2025 లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలని చెప్పారు. నిర్ధేశిత గడువులోగా కల్వకుర్తి పూర్తి చేసే ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణా రావు, తెలంగాణ ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో జిల్లాలో వివిధ పథకాల పురోగతి, తీసుకుంటున్న చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. జిల్లాలో మొత్తంగా రూ. 396.09 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. మొదట కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లను ప్రారంభించారు. అలాగే, పాలమూరు వర్సిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్ నిర్మాణం, దేవరకద్రలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం, మహబూబ్‌నగర్‌ రూరల్‌ మరియు గండీడ్‌లో కేజీవీబీ భవనాల నిర్మాణం, మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులు, ఎస్టీపీ నిర్మాణం వంటి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :