Tuesday, 28 July 2026 02:45:45 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పోస్టర్ తయారీలో సిద్ధార్థ విద్యార్థినికి జిల్లా ప్రధమ బహుమతి...

Date : 03 July 2024 09:22 PM

Telugu Rekha Media - తెలంగాణ / వరంగల్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ నేషనల్ గ్రీన్ కాప్స్ (ఎన్జీసి) మరియు వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు వరంగల్ శంభునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోస్టర్ తయారీ పోటీలో చెన్నారావుపేట మండలంలోని సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థిని ముదురుకోల శ్రీనిధి ప్రధమ స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా విద్యార్థి శ్రీనిధి మరియు గైడ్ టీచర్ గణేష్ గారిని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి వాసంతి గారు, జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్ గారు ప్రశంసా పత్రం మరియు మెమెంటో తో సత్కరించి అభినందించారని హెచ్ఎం కరుణాకర్ రెడ్డి గారు తెలిపారు. భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువును తట్టుకోగలగడం అనే అంశంపై వరంగల్ జిల్లాలోని అన్ని ఉన్నత జిల్లాస్థాయి కవితలు మరియు పోస్టర్ తయారీ పోటీలలో పాల్గొన్న శ్రీనిధితో పాటు పాల్గొన్న విద్యార్థులు సహస్ర,మానస, అక్షయ,లహరి,ధరణి,బి.సహస్ర లను పాఠశాల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి గారు అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు కళా, సృజనాత్మక రంగాలలో కూడా తమ పోటీ తత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: