Tuesday, 28 July 2026 05:24:50 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రజావాణి ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి...

వారం రోజుల్లో ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారం చేయాలి.. --జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

Date : 25 June 2024 09:03 AM

Telugu Rekha Media - తెలంగాణ / భూపాలపల్లి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి జిల్లా అధికారులు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రజావాణి నుండి కూడా జిల్లాకు సంబంధించి నటువంటి దరఖాస్తులు రావడం జరుగుతుందని అట్టి దరఖాస్తులు వారం రోజుల్లో పరిష్కరించి ప్రజావాణి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులు సత్వర పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు వారి వారి కార్యాలయ పరిధిలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించుకోవాలని ఆదేశించారు. సమస్య పరిష్కారానికి అందచేసిన దరఖాస్తుదారునికి సమస్య పరిష్కార స్వభావంపై లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం చాలా ముఖ్యమైనదని అన్ని శాఖల అధికారులు నిర్దేశిత సమయానికి హాజరు కావాలని తెలిపారు. అధికారులు సమయపాలన పాటించాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ప్రజావాణి నుండి మన జిల్లాకు 135 ఫిర్యాదులు సిఫారసు చేసారని రానున్న వారంలో పరిష్కరించాలని పెండింగ్ ఉంచొద్దని అధికారు లను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :