Sunday, 26 July 2026 11:51:32 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి...

-- జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్.

Date : 02 July 2024 10:20 AM

Telugu Rekha Media - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు..బాల కార్మికుల కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి. జూలై 1 నుండి 31-07-2024 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ లో పోలీస్ అధికారులు , చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బందితో జిల్లాలో రెండు టీమ్ లు ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వర్తించి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాడం జరుగుతుందని ఎస్పీ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అన్ని శాఖల సమన్వయంతో పని చేసి ముస్కాన్. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 18సంవత్సరాల లోపు తప్పిపోయిన, వివిధ రకాల బాల కార్మికులు వారు కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తూ మరియు వదిలివేయబడిన పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుంది. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేయడం జరుగుతుందని,జిల్లాలో చిన్నపిల్లలతో పని చేపించే వారిపై నిత్యం నిఘా ఉంటుందని తెలిపారు.బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ది సాధ్యమవుతుందని,ఆదిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ గారు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా పోలీస్ లకు సమాచారం అందించాలని, ఈ ట్రోల్ ఫ్రీ నంబర్స్ 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు.చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి మొహంలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: