Tuesday, 28 July 2026 05:24:24 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

రుణమాఫీ అమలు చేశాం.. రైతులను రారాజులు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం...

-- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Date : 19 July 2024 12:23 AM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ, తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం.. రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా, యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలు మాటలు చెప్పే అలవాటు గాంధీ కుటుంబానికి లేదని, కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది శిలాశాసనం లాంటిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలోనైనా, ఆరు గ్యారంటీల అమలు విషయంలోనైనా, నేటి రైతు రుణమాఫీ విషయంలోనైనా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు రుణమాఫీ తొలివిడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 577 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలాదిమంది రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రూ.1లక్ష లోపు అప్పులున్న రైతులు రుణ విముక్తులయ్యారని, జులై చివరిలోగా రూ.1.5లక్షల రుణాలున్న వారు, ఆ తర్వాత రూ.2 లక్షల రుణాలున్న వారి ఖాతాల్లోనూ డబ్బులు వేసి ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం చెప్పారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లోనే ప్రజలకు రూ.29 వేల కోట్ల విలువైన సంక్షేమాన్ని అందించామని సీఎం తెలిపారు. అనంతరం పలువురు రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహా దారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: