Telugu Rekha Media - తెలంగాణ / కరీంనగర్ : హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి భీమదేవరపల్లి , సైదాపూర్, చిగురుమామిడి, అక్కన్నపేట, తదితర మండలాల్లో గురువారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదానం కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం చౌరస్తాలో పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు తరలివచ్చి కేక్ కట్ చేసి కేంద్రమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ పేదల ఆశాజ్యోతి అని పేద ప్రజల తరఫున ఆయన చిన్నప్పటి నుండి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఎంతో ఉన్నతమైన శిఖరాన్ని అవరోధించినటువంటి బండి సంజయ్ మనకందరికీ ఆదర్శప్రాయుడని మనసున్న మంచి నేతగా గుర్తింపు పొందాడని ఆయన అన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డితో పాటు బిజెపి మండల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, బీజేవైఎం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పెందట భూశంకరాచారి, బిజెపి అక్కన్నపేట మండల కార్యదర్శి కళ్యాణ్ విష్ణు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏర్రోజు సాయి, వారుకోలు నాగరాజు, ఆశడం శ్రీనివాస్, బొడిగే వెంకటేష్, పోలజు వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media