Tuesday, 28 July 2026 04:28:12 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఫోన్ పోతే ఆందోళన పడవద్దు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది...

-- పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ.

Date : 29 July 2024 07:23 PM

Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయిన, ఎవ్వరైనా దొంగలించకపోయినా వెంటనే సీఈఐఆర్ డాటా నమోదు చేయాలి ఫోన్ రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 20-ఏప్రిల్-2023 నుండి 978 సెల్ ఫోన్లు సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకుని సంబంధిత బాధితులకు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. పట్టణాలలో గ్రామాలలో ఫోన్ దొంగతనం జరిగిన ఎక్కడైనా పడిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి సూచించారు. 978 సెల్ ఫోన్లు రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించడం జరిగింది. మిగతా ఫోన్లు కూడా త్వరలో ట్రేస్ ఔట్ చేసి సంబంధిత బాధితులకు అప్పగించడం జరుగుతుంది. సెల్ఫోన్ పోయిందా.. అయితే టెన్షన్ పడకండి.. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని సిద్దిపేట పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రస్తుత రోజుల్లో చిన్నవాళ్ల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి జీవితంలో సెల్ఫోన్ ఒక భాగమైపోయింది. ఒక్కోసారి ఫోన్ కనిపించకపోయినా. ఎక్కడైనా పోగొట్టు. కున్నా. ఎవరైనా దొంగిలించినా.ఆ బాధ వర్ణణాతీతం. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ సైటను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సీఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, సెల్ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ వెబ్సైట్ లో పూర్తి వివరాలు నమోదు చేస్తే వీలైనంత తొందరగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమిషనర్ తెలిపారు.

సీఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవాలి. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సెల్ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ముందుగా ఫిర్యాదు చేయాలి, లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి www.ceir.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాప్ట్, స్టోలెన్ అనే లింకై క్లిక్ చేసి, సెల్ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ఏరోజు, ఎక్కడ పోయింది. రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా. పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఏ కంపెనీ మొబైల్ అయినా సీఈఐఆర్ విధానం 24 గంటల్లోపు ఫోన్ పని చేయకుండా చేస్తుంది. సెల్ఫోన్ దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి అక్ ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేసి. ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

సీఈఐఆర్ వెబ్సైట్ పై అవగాహన కార్యక్రమాలు. సీఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం: సెల్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ సీఐఈఆర్ గురించి తెలిసేలా పోలీస్ స్టేషన్లో, సర్కిల్ పరిధిలో, డివిజన్ పరిధిలో బ్లూ కోర్ట్స్, పెట్రో కార్ సిబ్బందిచే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని. సెల్ఫోన్ పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించి సీఈ ఐఆర్ అప్లికేషనన్ను సద్వినియోగం చేసుకోవాలని, ఫోను పెద్దదైన చిన్నదైనా అందులో ఉన్న డాటా చాలా ముఖ్యమని ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్జక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా సెల్ఫోన్ ద్వారానే చేయడం జరుగుతుందన్నారు. ఫోన్ ఎక్కడ పడిపోయినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో సీఈఐఆర్ పోర్టల్ లో డాటా ఎంట్రీ చేసుకోవాలని కమిషనర్ ప్రజలకు సూచించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: